Subscribe For Newsletter

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి : నాగరిగారి ప్రీతం

 11 Apr 2020

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి : నాగరిగారి ప్రీతం
కరోనా ప్రభావంతో రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రోజువారి కూలీలు తాపీ మేస్త్రీలు కార్పెంటర్స్ పెయింటర్స్ ఎలక్ట్రీషియన్స్ ఇటుక బట్టీ కార్మికులు తదితర 54 రకాల భవన నిర్మాణ వృత్తులు చేస్తున్నారని 20 లక్షల మందికి పైగా మన రాష్ట్రంలో ఉన్నారని అందువల్ల నిర్మానాలు ఆగిపోవడంతో వీరంతా ఎలాంటి పనులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని కరోనా ప్రభావం తో పనులు కోల్పోతున్న భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతం అన్నారు . మన రాష్ట్రంలో 2300 కోట్లకు పైగా భవన నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ ఫండ్ ఉంది కానీ ఇంతవరకు ఎలాంటి ఆర్థిక సహాయం మన రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు అందలేదు అన్నారు. కేరళ ప్రభుత్వం 16 రకాల నిత్యావసర ఆర్థిక సహాయాన్ని అందించిందని , ఢిల్లీ ప్రభుత్వం 5 వేల రూపాయలు అందజేసిందని , వెల్ఫేర్ బోర్డ్ సెస్ నిధుల నుండి కార్మికులకు ఆర్థిక సహాయం అందించి భవన నిర్మాణ కార్మికులకు ఆదుకోవాలని వారు అన్నారు.